వలస కూలీలు, బిక్షాటకులకు దుప్పట్లు పంపిణీ..
బతుకుదెరువు కోసం వలస వచ్చి రోడ్ల వెంట, ఫ్లైఓవర్ల కింద చలికి వణుకు జీవనం వెల్లదీస్తున్న వారికి సందయ్య మెమోరియల్ ట్రస్ట్ బాసటగా నిలిచింది. నల్లగండ్ల పరిసర ప్రాంతాల్లో చలికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు, బిక్షాటకులకు ఆదివారం శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ దుప్పట్లు పంపిణీ చేశారు.
కనీస అవసరాలు తీర్చకోలేని దుస్థితిలో ఉన్నట్లువంటి పేద ప్రజలకు తన వంతుగా సహాయం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని కలిగి ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చిన తన ట్రస్ట్ ద్వారా సహాయ సహకరాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజ సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లేష్, వసంత్యాదవ్, కిశోర్, సురేష్, ప్రభాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
