హైటెక్‌సిటీలో దారుణం.. యువకుడి చేతికి కట్ చేసిన చైనా మాంజా..
చైనా మాంజా ఈ పేరు వింటే బైకర్లు హడలెత్తిపోతున్నారు. బైక్‌పై వెళ్తుండగా ఎక్కడ చైనా మాంజా తగిలి ప్రాణాపాయం అవుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఇటీవల చైనా మాంజాలు మెడకు తలిగి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా మాంజా ఉపయోగించవద్దు ప్రాణాలు పోతున్నాయి అని ఒక వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్న వ్యాపారులు మారడం లేదు. బ్లాక్ మార్కెట్లో చైనా మాంజా అమ్ముతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. వినయోగదారులు అదే చైనా మాంజాలతో పతంగులు ఎగరవేసి తోటి ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు.
హైటెక్‌సిటీలో ఓ యువకుడు ఆదివారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తండగా చైనా మాంజా చేతికి తగిలి తీవ్ర గాయం అయ్యింది. చెయ్యి లోపలి వరకు కట్ అయ్యి ఆసుపత్రిలో చేరాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం పెద్ద వాల్తేరు విజయ్‌నగర్‌కాలనీకి చెందిన కుడుం సూర్యతేజ(33) మియాపూర్‌లో నివాసం ఉంటూ హైటెక్‌సిటీలో ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని తన బైక్‌పై గచ్చిబౌలి నుండి హఫీజ్‌పేట్ వైపు వస్తున్నాడు. బొటానికల్ గార్డెన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ పైకి రాగానే చైనా మాంజా సూర్యతేజ ఎడమచేతికి తగిలి చేతి భుజం కట్ అయ్యి తీవ్ర రక్తస్రావమైంది. స్నేహితుల సహాయంతో మాదాపూర్‌లోని ఓప్రైవేట్ ఆసుపత్రి సూర్యతేజ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.
