Cultural activities
శిల్పారామంలో న్యూ ఇయర్ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు
మాదాపూర్ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]
