కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్‌గా రాజ్‌కుమార్ గోయల్
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
రాజ్‌కుమార్ గోయల్‌తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా సెప్టెంబర్ 13న పదవీ విరమణ చేయడంతో అప్పటి నుండి ఈ పోస్టు ఖాళీగా ఉంది.
ఎనిమిది మంది నూతన సమాచార కమిషనర్లు వీరే..
జయ వర్మ సిన్హా: మాజీ రైల్వే బోర్డు ఛైర్మన్.
స్వాగత్ దాస్: మాజీ ఐపిఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖలో కీలక పదవులు నిర్వహించారు.
సురేంద్ర సింగ్ మీనా: మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి.
సంజీవ్ కుమార్ జిందాల్: మాజీ సిఎస్ఎస్ అధికారి, హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
ఖుష్వంత్ సింగ్ సేథి: మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి.
సుధా రాణి రేలంగి: పెట్రోలియం అండ్ సహజవాయువు నియంత్రణ మండలి మాజీ సభ్యురాలు (న్యాయ).
పి. ఆర్. రమేష్: సీనియర్ జర్నలిస్ట్.
ఆశుతోష్ చతుర్వేది: సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్.
ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ ఇప్పటికే కేంద్ర సమాచార కమిషనర్లుగా కొనసాగుతున్నారు.
కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా నియామకం అయినా రాజ్‌కుమార్ గోయల్ జీతం నెలకు రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేలు) స్థిరంగా ఉంటుంది. ఇతర అలవెన్సులు, భత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానంగా ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
జీతం & అలవెన్సులు:
జీతం: నెలకు రూ. 2,50,000 (ఫిక్స్డ్).
ఇతర అలవెన్సులు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వర్తించే అలవెన్సులు, భత్యాలు (డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ వంటివి) కూడా లభిస్తాయి.
పెన్షన్: అపాయింట్‌మెంట్ సమయంలో పెన్షన్ పొందుతున్నట్లయితే, జీతం నుండి ఆ పెన్షన్ మొత్తం తీసివేయబడుతుంది.
