కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్
బీహార్ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు
ఇటీవల బీహార్ రాష్ర్టంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఏడుగురు నేతలు పార్టీ బహిరంగ విమర్శలు చేయడం, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ బీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కపిల్‌దేవ్ ప్రసాద్ యాదవ్ పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్ణయాలను పదేపదే పత్రికల్లోనూ, సామాజికమాధ్యమాల్లోనూ విమర్శించడం, టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని తెలిపింది. పార్టీ పరిశీలకులు, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ సమీక్ష జరిపి, కేంద్ర పరిశీలకులు అవినాష్ పాండే సమ్మతితో పూర్తి పారదర్శకతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించింది.
కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన లీడర్లు వీరే..
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా నేతల్లో కాంగ్రెస్ సేవా దళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలుర్ రెహ్మాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, ఇతర వెనుకబడిన తరగతుల విభాగం మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలందా జిల్లాకు చెందిన రవి గోల్డెన్ ఉన్నారు. తాజా బహిష్కరణలపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలను కాపాడేందుకే అసమ్మతి పేరుతో కొందరిని బలిపశువులను చేశారని సస్పెండ్ అయినా లీడర్లు ఆరోపించారు
