శిల్పారామంలో న్యూ ఇయర్​ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు
1 min read

శిల్పారామంలో న్యూ ఇయర్​ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు

 

మాదాపూర్​ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి.

శిల్పారామంలో సందర్శకులు

చేనేత ఉత్తత్తుల స్టాల్స్​ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్​, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి.

కూచిపూడి నృత్యం

శిల్పారామంలోని విలేజ్​ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శిల్పారామం నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.

ఒడిసి నృత్యం