చందానగర్ పోలీస్ స్టేషన్‌ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ
చందానగర్ పోలీస్ స్టేషన్‌ను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ అకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు.

రికార్డులను నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ ఇన్స్పెక్టర్, అడ్మిన్ ఎస్ఐపై అగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల గౌరవంగా మాట్లాడుతూ భరోసా కల్పించాలని డీసీపీ సిబ్బందికి తెలియజేశారు. డీసీపీ వెంట ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, చందానగర్ ఇన్స్పెక్టర్ విజయ్, డీఐ భాస్కర్లు ఉన్నారు
