హైటెక్​సిటీలో గంజాయి సాగు… అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చిక్కిండు
1 min read

హైటెక్​సిటీలో గంజాయి సాగు… అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చిక్కిండు

ఇన్నీ రోజులు ఐటీ కారిడార్​లో  డ్రగ్స్​, గంజాయి క్రయ, విక్రయాలు, గంజాయి సేవించడం మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఐటీ కారిడార్​లో గంజాయి సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుండి హైదరాబాద్​, ఐటీ కారిడార్​కు గంజాయి ట్రాన్స్​పోర్ట్​ అయ్యేది.

 

బయటి నుండి గంజాయి తెచ్చి అమ్మకం ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా త ఇంట్లోనే గంజాయి మొక్కను సాగు చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద గంజాయి ఉందని కావాలా అంటూ అమ్మకానికి పెట్టాడు. పోలీసులకు సమాచారం అందడంతో సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

 

ఈ సంఘటన గచ్చిబౌలి గోపన్​పల్లి ఏరియాలో చోటుచేసుకుంది. .గోపన్​పల్లి ఎన్టీఆర్​నగర్​లోని టాటా ఇనిస్టిట్యూట్​ ఆప్​ ఫండమెంటల్​ రిసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ సమీపంలో గోగినని సత్యనారాయణ(55) నివాసం ఉంటూ వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు. వాచ్​మెన్​గా పనిచేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడంతో గంజాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

 

తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను సాగు చేస్తున్నాడు. తన వద్ద గంజాయి ఉందని, కావాలా అంటూ స్థానికంగా పలువురికి అమ్మేందుకు ప్రయత్నించాడు. గంజాయిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు గురువారం సత్యనారాయణ ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా గంజాయి మొక్కను గుర్తించారు. గంజాయి మొక్కను స్వాధీనం చేసుకొని సత్యనారాయణపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.