గచ్చిబౌలి స్టేడియం నిర్వహణ బాగుంది..
1 min read

గచ్చిబౌలి స్టేడియం నిర్వహణ బాగుంది..

ఫిఫా అకాడమీ నిర్వహణ తీరు అభినందనీయం

భారత ప్రభుత్వ క్రీడల క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు

 

గచ్చిబౌలి లోని జీఎంసీబీ స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ అండ్​ భారత ప్రభుత్వ క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ టవర్, ఫిఫా అకాడమీ, హాకీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, మెయిన్ స్టేడియం తదితర క్రీడా సౌకర్యాలను పరిశీలించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న ఖేలో ఇండియా కార్యక్రమాలు సహా ఇతర క్రీడా అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.

ఖేలో ఇండియా పోటీలను తెలంగాణలో నిర్వహించే అవకాశాలు, అందుకు అవసరమైన సౌకర్యాలపై సమీక్షించారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న ఫిఫా అకాడమీ ఏర్పాట్లు, నిర్వహణ పట్ల అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పీటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డాక్టర్ రవితేజ, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు తదితరులు పాల్గొన్నారు.