ప్రధాని మోదీతో ఫోన్​లో మాట్లాడిన ట్రంప్​
1 min read

ప్రధాని మోదీతో ఫోన్​లో మాట్లాడిన ట్రంప్​

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు గురువారం ఫోన్​లో మాట్లడుకున్నారు. ఈ సంభాషణ చాలా “ఆత్మీయంగా, ఆసక్తికరంగా” సాగినట్లు మోదీ వర్ణించారు. ట్విట్టర్​ వేదికగా ట్రంప్​తో మాట్లాడినట్లు తెలిపారు.

ఇద్దరి ఫోన్​ చర్చలోని ముఖ్యాంశాలు..

ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలని నొక్కిచెప్పారు. రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, భద్రత వంటి ప్రాధాన్యత రంగాలలో సహకారాన్ని విస్తరించుకోవడంపై అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇద్దరు నేతలు ముఖ్యమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా చర్చింకున్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారతదేశం అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యం, ఇటీవల రష్య అధ్యక్షుడు పుతిన్​ భారత్​ పర్యటన అనంతరం ట్రంప్​, మోదీ సంభాషణణ ప్రాధాన్యత సంతరించుకుంది