సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?
1 min read

సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?

  • రాజమౌళికి తలకెక్కిన డబ్బు మదం, అహంకారం..
  • ​రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై నమ్మకం రాదు..
  • హిందువులకు సారీ చెప్పకపోతే ఖబర్ధార్..
  • విశ్వ హిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్

 

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళికి అహంకారం ఎక్కువైందా ? డబ్బు మదం ఏర్పడిందా ? అంటే అనుననే అంటున్నారు విమర్శకులు. లంకను దహనం చేసిన తరహాలో సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై ఆయనకు నమ్మకం కలుగుతుందని విశ్వ హిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్ హెచ్చరించారు. దీంతో డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు చేయనున్నారా ? అంటూ సోషల్​ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఇటీవల మహేష్​బాబు హిరోగా డైరెక్టర్​ రాజమౌళి తీస్తున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఈవెంట్​పై హనుమంతుడిపై నమ్మకం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం ఏర్పడింది. హిందువుల మనోభావాలను దెబ్బతిసే విధంగా రాజమౌళి మాట్లాడాడు అంటూ హిందువులు మండిపడుతున్నారు. డబ్బు మదం , అహంకారం తలకెక్కిన రాజమౌళికి చేసిన తప్పును క్షమాపణ చెప్పడానికి కూడా మనసు రావడం లేదని విశ్వ హిందు పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తుం చేస్తున్నారు.

లంక దహనం తరహాలో ఆయనపై దాడులు జరిగితే కానీ హనుమంతుడి పై నమ్మకం కలుగుతుందని విశ్వహిందు పరిషత్​ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ… రెండు రోజుల నుండి యావత్తు హిందూ సమాజం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజమౌళి మనసుకు క్షమాపణ చెప్పాలని కలగకపోవడం దారుణమైన విషయం అని అన్నారు.

రాజమౌళి ఖబడ్ధార్ అంటూ హెచ్చరిస్తూ… యావత్ హిందూ సమాజం ఆగ్రహం కట్టలు తెంచుకుంటే , లంక దహనం ఎలా ఉంటుందో చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జిహాదా మాఫియా నిధులు ఉన్నాయని, అందుకే అనేక చిత్రాలలో హిందూ దేవదేవుళ్లను అపహాస్యం చేసే విధంగా, హిందూ కుటుంబ వ్యవస్థను గాయపరిచే విధంగా పలు సీన్లు చూపెడుతున్నారని ఆరోపించారు. అలాంటి దృశ్యాలు చూపెడితే ఇక నుండి హిందూ సమాజం తగిన బుద్ధి చెపుతుందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను దర్యాప్తు చేస్తున్న తరహాలోనే , సినీ రంగంలో ఉన్న జిహాదీ మాఫియా నిధులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని శశిధర్ తెలిపారు.