స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తించనున్నాయి. తిరిగి జనవరి 19వ తేదిన విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఇక తెలంగాణ రాష్ర్టంలో సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేది నుండి 15వ తేది వరకు ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల కోసం పిల్లలతో పాటు వారి తల్లిందండ్రులు కూడా ఎదురుచూస్తున్నారు. సెలవులు ప్రకటన రావడంతో సొంతూర్లకు కుటుంబంతో కలిసి వెళ్లి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందుగానే సొంతూర్లకు బస్సు టికెట్లు, ట్రైయిన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. సొంత వాహనాల్లో వెళ్లేవారు ముందస్తుగానే తమ అఫీసులకు సెలవుల కోసం తమ యాజమాన్యాలను కోరుతున్నారు.
